Vaishnav tej: 'కొండ పొలం' రిలీజ్ డేట్ మారలేదట!

  • 'ఉప్పెన'తో హిట్ కొట్టిన వైష్ణవ్ తేజ్
  • రెండో సినిమాగా వస్తున్న 'కొండ పొలం'
  • లవ్ .. ఎమోషన్స్ తో సాగే కథ
  • అక్టోబర్ 8వ తేదీన విడుదల
No change in Kondapolam release date

వైష్ణవ్ తేజ్ - కృష్ణ కాంబినేషన్లో 'కొండ పొలం' సినిమా రూపొందింది. సాయిబాబు - రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా, అక్టోబర్ 8వ తేదీన విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వలన ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడిందన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

అయితే 'కొండ పొలం' సినిమా విడుదల తేదీ వాయిదా పడలేదనీ, ముందుగా చెప్పినట్టుగా అక్టోబర్ 8వ తేదీనే థియేటర్లకు రానుందని అంటున్నారు. వచ్చే వారం నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ మొదలవుతాయని చెబుతున్నారు. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ జోడీగా రకుల్ అలరించనుంది.

ఈ కథ గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది .. పశువుల కాపరిలా వైష్ణవ్ తేజ్ కనిపించనుండగా, చాలా సింపుల్ మేకప్ తో రకుల్ అలరించనుంది. లవ్ .. ఎమోషన్స్ ప్రధానంగా నడిచే ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. 'ఉప్పెన' తరువాత వైష్ణవ్ తేజ్ చేసిన ఈ సినిమా, ఆయనకీ మరో హిట్ ఇస్తుందేమో చూడాలి.

More Telugu News