Corona Virus: దేశంలో క‌రోనా కేసుల తాజా వివరాలు

  • కొత్త‌గా 31,923 క‌రోనా కేసులు
  • నిన్న 282 మంది మృతి
  • మృతుల సంఖ్య మొత్తం  4,46,050
  • నిన్న 71,38,205 వ్యాక్సిన్ డోసుల వినియోగం
corona bulletin in inida

దేశంలో కొత్త‌గా 31,923 క‌రోనా కేసులు నమోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య‌, ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, కొత్త‌గా 31,990 మంది కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి మొత్తం సంఖ్య 3,28,15,731కు చేరింది. కొత్త‌గా 282 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,46,050కు చేరింది.

ఇక ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 187 రోజుల క‌నిష్ఠానికి చేరుకుంది. ప్ర‌స్తుతం 3,01,604 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో నిన్న 71,38,205 వ్యాక్సిన్ డోసులు వేశారు. అలాగే, ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 83,39,90,049 వ్యాక్సిన్ డోసులు ఇవ్వడం జరిగింది. కాగా, నిన్న ఒక్క కేర‌ళ‌లోనే 19,675 మందికి వైర‌స్ సోకింది. అలాగే, నిన్న ఆ రాష్ట్రంలో 142 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు.

More Telugu News