జూబ్లీహిల్స్ హోటల్‌ లో మహిళల బాత్రూములో సీక్రెట్ కెమెరా.. నిందితుడి అరెస్ట్

23-09-2021 Thu 08:36
  • జూబ్లీహిల్స్‌లోని వన్‌డ్రైవ్ ఫుడ్ కోర్టులో ఘటన
  • కెమెరాను గుర్తించి ఫిర్యాదు చేసిన యువతి
  • బాత్రూమ్ క్లీనర్ బెనర్జీని అదుపులోకి తీసుకున్న పోలీసులు
secret camera in Hotel bathroom in Hyderbabd jubilee hills man arrested
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఓ హోటల్‌ బాత్రూములో రహస్య కెమెరాతో ఫొటోలు, వీడియోలు తీస్తున్న ఘటన వెలుగులోకి వచ్చి కలకలం రేపింది. కెమెరాను గుర్తించిన యువతి ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్‌లోని వన్‌డ్రైవ్ ఫుడ్‌కోర్టులో ఈ ఘటన జరిగింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే హోటల్‌కు చేరుకుని బాత్రూమును తనిఖీ చేశారు. అప్పటికీ అది ఆన్‌లోనే ఉన్నట్టు గుర్తించారు. బాత్రూమ్ క్లీనర్ బెనర్జీ ఈ కెమెరాను అమర్చినట్టు గుర్తించి అతడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.