సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

23-09-2021 Thu 07:32
  • తన పాత్రల గురించి సాయిపల్లవి 
  • మహేశ్, త్రివిక్రమ్ సినిమా అప్ డేట్  
  • విజయ్ సినిమా విడుదల వాయిదా?
Sai Pallavi says her role in a film should be morally good

*  'నేను చేసే సినిమాలు సమాజానికి చెడు కలిగించేలా వుండకూడదు, ఆ విషయంలో చాలా జాగ్రత్తగా వుంటాను' అంటోంది కథానాయిక సాయిపల్లవి. 'నేను చేసే క్యారెక్టర్ మోరల్ గా బాగుండాలి. సమాజాన్ని, ముఖ్యంగా యూత్ ని తప్పుదారి పట్టించేలా వుండకూడదు. అలాటి పాత్రలయితే మాత్రం కచ్చితంగా చేయను' అని చెప్పింది సాయిపల్లవి.
*  ప్రస్తుతం 'సర్కారువారి పాట' చిత్రంలో నటిస్తున్న మహేశ్ బాబు దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగును నవంబర్ నెలాఖరు నుంచి నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ముందుగా విదేశాలలో ఒక పాటను చిత్రీకరిస్తారట.
*  తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం 'బీస్ట్'. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మొదటగా వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. అయితే, ఇప్పుడిది వచ్చే వేసవికి వాయిదాపడినట్టు సమాచారం. ఇందులో పూజ హెగ్డే కథానాయికగా నటిస్తోంది.