తెలంగాణలో మరో 258 మందికి కరోనా పాజిటివ్

22-09-2021 Wed 21:15
  • గత 24 గంటల్లో 55,419 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 69 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 4,946 మందికి చికిత్స
Corona positive for another 258 people in Telangana

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 55,419 కరోనా పరీక్షలు నిర్వహించగా, 258 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 69 కొత్త కేసులు వెల్లడి కాగా, కరీంనగర్ జిల్లాలో 25, రంగారెడ్డి జిల్లాలో 21, ఖమ్మం జిల్లాలో 15, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 13 కేసులు గుర్తించారు. వికారాబాద్, నారాయణపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 249 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,64,164 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,55,310 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,946 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,908కి పెరిగింది.