నెల్లూరులో మహిళ ఆత్మహత్య.. అడ్డుకోకుండా వీడియో తీసిన భర్త!

22-09-2021 Wed 21:13
  • ఆత్మకూరు మెప్పాలో ఉద్యోగం చేస్తున్న మహిళ
  • భర్త కళ్లెదుటే ఆత్మహత్య చేసుకున్న వైనం
  • వీడియో తీసి బంధువులకు పంపిన పైశాచిక భర్త
  • అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న మృతురాలి సహోద్యోగులు
Husband takes video of his wife committing suicide

నేటి సమాజంలో ఏం జరుగుతున్నా మొబైల్‌లో వీడియోలు తీయడం కొందరికి అలవాటైపోయింది. ప్రమాదంలో పడిన వారిని కూడా రక్షించకుండా వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో జరిగింది. కొండమ్మ అనే మహిళ ఆత్మకూరు మెప్మాలో రీసోర్స్ పర్సన్‌గా పనిచేస్తోంది. ఏదో విషయంలో మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్య చేసుకుంది.

అయితే కొండమ్మ ఉరేసుకునే సమయంలో ఆమె భర్త పెంచలయ్య అక్కడే ఉన్నాడు. భార్య సూసైడ్ చేసుకుంటుంటే ఎదురుగా నిలబడి మొబైల్‌లో వీడియో తీస్తూ నిలబడ్డాడు. ఆమె గిలగిలా కొట్టుకుంటున్నా కాపాడే ప్రయత్నం చేయలేదు. ఆమె మరణించిన తర్వాత ఆ వీడియోను కొండమ్మ బంధువులకు షేర్ చేశాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు పైశాచిక భర్త పెంచలయ్యపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని మెప్మాలో కొండమ్మ సహోద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.