ప్రజలు మాటల మనిషి చంద్రబాబును కోరుకోవడం లేదు.. చేతల మనిషి జగన్ కావాలంటున్నారు: మంత్రి వెల్లంపల్లి

22-09-2021 Wed 20:09
  • పరిషత్ ఎన్నికల పలితాలతో విపక్షాల్లో గుబులు మొదలైంది
  • రాష్ట్ర ప్రజలు చంద్రబాబు మాటలు నమ్మే పరిస్థితిలో లేరు
  • వైసీపీ మినహా రాష్ట్రంలో ఇతర పార్టీలకు చోటులేదు
  • గుజరాత్‌లో పట్టుబడిన డ్రగ్స్‌తో విజయవాడకు సంబంధం లేదన్న మంత్రి
People are supporting working man Jagan says Minister Vellampally Srinivas
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మాటల మనిషి చంద్రబాబును కోరుకోవడం లేదని, చేతల మనిషి వైఎస్ జగన్మోహన్ రెడ్డే కావాలని అనుకుంటున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. పరిషత్ ఎన్నికల్లో వచ్చిన ఏకపక్ష తీర్పుతో ఈ విషయం మరోసారి రుజువైందని, ఈ ఫలితాలతో విపక్షాల్లో గుబులు మొదలైందని ఆయన చెప్పారు. ప్రజలు చంద్రబాబు మాటలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పిన ఆయన.. రాష్ట్రంలో వైసీపీ మినహా ఇతర పార్టీలకు చోటు లేదని స్పష్టంచేశారు.

బుధవారం నాడు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికల్లో ఎంపీటీసీల్లో 86 శాతం, జెడ్‌పీటీసీల్లో 98 శాతం సీట్లు వైసీపీకి దక్కిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాలతో విపక్షాల్లో గుబులు మొదలైందని వెల్లంపల్లి అన్నారు. అలాగే డ్రగ్స్ వ్యవహారంలో టీడీపీ నేతలు పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడో గుజరాత్‌లో పట్టుబడిన డ్రగ్స్‌తో విజయవాడకు సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు.