ప్రభాస్ .. పూజ హెగ్డే మధ్య ఎలాంటి గొడవా లేదంటున్న మేకర్స్!

22-09-2021 Wed 19:03
  • పూజ హెగ్డే ఎంతో సహకరించింది
  • ఏ విధంగానూ ఇబ్బంది పెట్టలేదు
  • షూటింగు సాఫీగా సాగింది  
  • పుకార్లను నమ్మవద్దంటున్న నిర్మాతలు        
Radhe Shyam movie makers gave a clarity on Rumours

ప్రభాస్ - పూజ హెగ్డే జంటగా 'రాధే శ్యామ్' సినిమా రూపొందింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించాడు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాను 'సంక్రాంతి' కానుకగా జనవరి 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

అయితే ఈ సినిమా షూటింగుకి సమయానికి రాకుండా పూజ చాలా ఇబ్బంది పెట్టిందనీ, ఆమె ధోరణి ప్రభాస్ పట్ల సరిగ్గా ఉండేది కాదనీ, అందువలన ప్రభాస్ ఆమెతో మాట్లాడానికి కూడా ఇష్టపడేవాడు కాదనే ప్రచారం కొన్ని రోజులుగా జరుగుతోంది. ఈ ప్రచారం అంతకంతకూ పెరిగిపోతోంది.

ఈ నేపథ్యంలో ఈ విషయంపై తాజాగా మేకర్స్ స్పందించారు. ప్రభాస్ - పూజ హెగ్డే మధ్య ఎలాంటి గొడవలేదని చెప్పారు. వాళ్లిద్దరూ తమకి ఎంతో సహకరించారనీ, పూజ హెగ్డే కారణంగా షూటింగుకి ఇబ్బంది అయిందనే వార్తలో కూడా ఎంతమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. దాంతో కొన్ని రోజులుగా చెలరేగిపోతున్న పుకారుకి ఫుల్ స్టాప్ పడిందని అనుకోవాలి.