దసరాకి మరింత పెరుగుతున్న పోటీ!

  • రోషన్ హీరోగా 'పెళ్లి సందD'
  • కథానాయికగా కన్నడ బ్యూటీ పరిచయం
  • ఆకట్టుకున్న ట్రైలర్
  • దసరాకి భారీ విడుదల  
Pelli SandaD will release at Dasara

సెకండ్ వేవ్ తరువాత థియేటర్లు నిదానంగా తెరుచుకున్నాయి. థియేటర్లకు రావడానికి ముందుగా చిన్న సినిమాలే ధైర్యం చేశాయి. ఆ తరువాత ఓ మాదిరి బడ్జెట్ సినిమాలు రంగంలోకి దిగుతున్నాయి. థియేటర్ల దగ్గర జనం పెరుగుతూ వస్తున్నారు. 'లవ్ స్టోరీ' సినిమాకి కొన్ని రోజుల ముందుగానే అడ్వాన్స్ బుకింగ్స్ జరిగిపోవడం అందరిలో ధైర్యాన్ని నింపుతోంది.

ఈ నేపథ్యంలో రోషన్ - శ్రీలీల కాంబినేషన్లో రూపొందిన 'పెళ్లి సందD' నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. గౌరీ రోణంకి దర్శకత్వం వహించిన ఈ సినిమాను దసరాకి విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. కీరవాణి సంగీతాన్ని అందించిన ఈ సినిమా కూడా దసరా బరిలోకి దిగుతూ ఉండటంతో పోటీ మరింత పెరుగుతోంది.

అఖిల్ హీరోగా చేసిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 8వ తేదీన విడుదల చేయనున్నారు. అదే రోజున క్రిష్ - వైష్ణవ్ తేజ్ కాంబినేషన్లోని 'కొండపొలం' సినిమాను విడుదల చేయనున్నారు. అక్టోబస్ 14వ తేదీన 'మహాసముద్రం' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మిగిలిన తేదీల్లో 'పెళ్లి సందD' ఎప్పుడు జరుగుతుందో చూడాలి.

More Telugu News