రేపు చరణ్ చేతుల మీదుగా 'అనుభవించు రాజా' టీజర్!

22-09-2021 Wed 17:52
  • జల్సా పురుషుడిలా రాజ్ తరుణ్
  • గ్రామీణ నేపథ్యంలో సాగే కథ
  • దర్శకుడిగా శ్రీను గవిరెడ్డి
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు    

Anubhavinchu Raja

రాజ్ తరుణ్ ను హీరోగా పరిచయం చేసిందే అన్నపూర్ణ బ్యానర్ వారు. మళ్లీ ఇప్పుడు ఆయనతో వాళ్లు మరో సినిమాను నిర్మించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ వారు భాగస్వాములుగా వ్యవహరిస్తున్న ఆ సినిమా పేరే 'అనుభవించు రాజా'. ఇటీవలే ఈ సినిమా నుంచి రాజ్ తరుణ్ ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు.

ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. చరణ్ చేతుల మీదుగా రేపు ఉదయం 10.08 నిమిషాలకు టీజర్ ను రిలీజ్ చేయిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, అందుకు సంబంధించిన స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. రాజ్ తరుణ్ లుక్ చూస్తుంటే పేకాట .. కోడిపందాలుతో జీవితాన్ని విలాసవంతంగా గడిపేసేవాడిలా కనిపిస్తున్నాడు. అంటే టైటిల్ కి తగినట్టుగానే మాంఛి జల్సా పురుషుడులా కనిపిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.