'వరుడు కావలెను' నుంచి లిరికల్ వీడియో సాంగ్!

22-09-2021 Wed 17:28
  • ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా 'వరుడు కావలెను'
  • దర్శకురాలిగా లక్ష్మీసౌజన్య
  • సంగీత దర్శకుడిగా విశాల్ చంద్రశేఖర్
  • గీత రచయితగా సిరివెన్నెల  
Varudu Kaavalenu lyrical video released

నాగశౌర్య - రీతూ వర్మ జంటగా 'వరుడు కావలెను' సినిమా రూపొందింది. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకి లక్ష్మీసౌజన్య దర్శకత్వం వహించారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా నుంచి తాజాగా ఒక లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు.

'మనసులోనే నిలిచిపోకే మైమరుపుల మధురిమా .. పెదవిదాటి వెలికిరాకే బెదురెందుకే హృదయమా ' అంటూ ఈ పాట సాగుతోంది. విశాల్ చంద్రశేఖర్ కట్టిన బాణీకి సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని అందించగా, చిన్మయి ఆలపించారు. ఈ సినిమాలో నాగశౌర్య మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తూ ఉండగా, రీతూ వర్మ మరింత అందంగా అనిపిస్తోంది.

లిరికల్ వీడియోను బట్టి చూస్తే, ఫొటోగ్రఫీకి ఎక్కువ మార్కులు పడేలా కనిపిస్తోంది. లవ్ .. ఎమోషన్స్ కి ప్రాధాన్యతనిస్తూ ఈ కథ నడవనుందని తెలుస్తోంది. నదియా .. మురళీశర్మ .. వెన్నెల కిషోర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది