తీవ్ర ఒడిదుడుకుల మధ్య నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

22-09-2021 Wed 15:49
  • 77 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 15 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • 3.63 శాతం లాభపడ్డ టెక్ మహీంద్రా షేర్
Markets ends in losses
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ ఫలితాలు రావడం మన మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 77 పాయింట్లు కోల్పోయి 58,927కి పడిపోయింది. నిఫ్టీ 15 పాయింట్లు నష్టపోయి 17,546 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టెక్ మహీంద్రా (3.63%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.92%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.31%), బజాజ్ ఆటో (1.12%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (1.08%).

టాప్ లూజర్స్:
హెచ్డీఎఫ్సీ లిమిటెడ్(-1.39%), నెస్లే ఇండియా (-1.22%), ఐసీఐసీఐ (-1.12%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.03%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-1.03%).