దిగొచ్చిన బ్రిటన్.. కొవిషీల్డ్‌కు గుర్తింపునిస్తూ తాజా ప్రకటన
- యూకే గుర్తింపు లభించిన నాలుగు వ్యాక్సిన్లలో కొవిషీల్డ్
- యూకే రావడానికి 14 రోజుల ముందుగా రెండు డోసులు తీసుకోవాలి
- వేరు వేరు వ్యాక్సిన్ డోసులు కూడా తీసుకోవచ్చు
తమ ప్రకటనను సవరించి కొత్తగా మరో ప్రకటన చేసింది. దానిలో కొవిషీల్డ్‌కు యూకే గుర్తింపు లభించినట్లు పేర్కొంది. మొత్తమ్మీద నాలుగు వ్యాక్సిన్లకు యూకే గుర్తింపు లభించినట్లు ఈ ప్రకటనలో పేర్కొంది. ఇంతకుముందు చేసిన ప్రకటనలో ఆక్స్‌ఫర్డ్/ఆస్ట్రాజెనెకా, ఫైజర్ బయాన్‌టెక్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలకు మాత్రమే గుర్తింపు ఇచ్చిన యూకే ప్రభుత్వం తాజాగా మరో నాలుగు ఫార్ములేషన్లకు కూడా అనుమతినిచ్చింది. ఈ జాబితాలో ఆస్ట్రాజెనెకా కొవిషీల్డ్, ఆస్ట్రాజెనెకా వ్యాగ్జెవేరియా, మోడెర్నా టకేడా టీకాల ఫార్ములేషన్లకు చోటు దక్కింది.
అలాగే అక్టోబరు 4 వరకూ రెండు వేరు వేరు వ్యాక్సిన్లు తీసుకున్న వారిని కూడా దేశంలోకి అనుమతించనున్నట్లు యూకే తెలిపింది. అయితే కేవలం యూకే గుర్తింపు పొందిన వ్యాక్సినేషన్ కార్యక్రమాల్లో వ్యాక్సిన్ తీసుకున్న వారికే ఈ అనుమతులు లభించనున్నాయి. తాజా ప్రయాణ సడలింపులు అక్టోబరు 4 సోమవారం ఉదయం 4 గంటల నుంచి అమల్లోకి రానున్న సంగతి తెలిసిందే.