అమెరికా ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరిన మోదీ

22-09-2021 Wed 13:09
  • రేపు క‌మ‌లా హ్యారిస్‌తో భేటీ
  • ఎల్లుండి బైడెన్‌తో స‌మావేశం
  • ఈ నెల 25న ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్ర‌సంగం
modi to visit usa

ప్రధాన మంత్రి న‌రేంద్ర‌ మోదీ అమెరికా ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరారు. త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రేపు ఆయ‌న అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ తో వాషింగ్టన్‌లో స‌మావేశం కానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో మోదీ ఎల్లుండి  సమావేశమవుతారు.  ద్వైపాక్షిక సత్సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు ఆఫ్ఘనిస్థాన్‌లోని పరిస్థితులు, ఉగ్రవాద నిరోధం వంటి ప‌లు అంశాల‌పై మోదీ, బైడెన్ చ‌ర్చించ‌నున్నారు.

ఎల్లుండి వాషింగ్టన్‌లో ఆస్ట్రేలియా, భారత్‌, జపాన్‌, అమెరికాల చతుర్భుజ భద్రతా కూటమి సదస్సులోనూ మోదీ పాల్గొంటారు. ఆయా దేశాల అధినేత‌లంద‌రూ ఈ స‌మావేశంలో పాల్గొన‌నున్నారు. అనంత‌రం ఈ నెల 25న న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో మోదీ  ప్రసంగిస్తారు. మోదీ తిరిగి భారత్‌కు ఆదివారం వస్తారు.