వైసీపీ నాయకులు అత్యాచారాలకు ఒడిగడుతున్నారు: నారా లోకేశ్

22-09-2021 Wed 12:56
  • వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అఘాయిత్యాలకు తెగపడుతున్నారు
  • తామేమి తక్కువ తినలేదంటూ అదే దారిలో వైసీపీ నాయకులు
  • విశాఖ వైసీపీ నాయకుడు వెంకటరావు దివ్యాంగురాలిపై లైంగిక దాడి
  • సభ్యసమాజం తలదించుకునేలా అఘాయిత్యం
nara lokesh slams ycp

వైసీపీ నేత‌ల‌పై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పించారు. వైసీపీ నాయకులు అత్యాచారాలకు ఒడిగడుతున్నారంటూ ఆయ‌న‌ ట్వీట్లు చేశారు.

'వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కామాంధుల్లా అఘాయిత్యాలకు తెగపడుతుంటే, తామేమి తక్కువ తినలేదంటూ వైసీపీ నాయకులు అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. కాటికి కాలుచాపే వయసులో అన్నీ చేయించుకోవాలనే ఆత్రపడే కాంబాబు, అరగంట పనోడు అవంతిని ఆదర్శంగా తీసున్నాడేమో?' అని నారా లోకేశ్ విమ‌ర్శ‌లు గుప్పించారు

'విశాఖ వైసీపీ నాయకుడు వెంకటరావు దివ్యాంగురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. సభ్యసమాజం తలదించుకునేలా దివ్యాంగురాలిపై అఘాయిత్యానికి పాల్పడటం దారుణం. దివ్యాంగురాలికి సాయం అందించాల్సిన చేతులే చిదిమేయడం ఘోరం' అని నారా లోకేశ్ విమ‌ర్శ‌లు గుప్పించారు.

'వైకాపా రేపిస్టుల తరపున పోలీసులు వకాల్తా పుచ్చుకుని.. చచ్చు మాటలు పుచ్చు వాదనలతో ప్రెస్ మీట్ పెట్టొద్దు. మీకు చేతనైతే, మీరు నిజమైన పోలీసులైతే నిందితుడిని కఠినంగా శిక్షించి, బాధితురాలికి న్యాయం చేయండి' అని నారా లోకేశ్ డిమాండ్ చేశారు.