పోలీసు స్టేష‌న్‌కు వెళ్లి ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి

22-09-2021 Wed 12:39
  • నిన్న  జూబ్లీహిల్స్‌లో రేవంత్ రెడ్డి ఇంటిపై దాడికి య‌త్నం
  • టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల‌పై రేవంత్ ఫిర్యాదు
  • కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌ను ఎందుకు అరెస్టు చేశార‌ని నిల‌దీత‌
revant reddy gives complaint

హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో నిన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు ప్ర‌య‌త్నించ‌గా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్న విష‌యం తెలిసిందే. దీంతో నిన్న‌ అక్క‌డ తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ రోజు రేవంత్ రెడ్డి స్వ‌యంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

నిన్న త‌న ఇంటిపై టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు దాడి చేశార‌ని, వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న కోరారు. టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు దాడుల‌కు పాల్ప‌డితే పోలీసులు కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్టు చేయ‌డ‌మేంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని ఆయ‌న కోరారు. రేవంత్ వెంట ప‌లువురు కాంగ్రెస్ నేత‌లూ ఉన్నారు.