మహేశ్ బాబు రిలీజ్ చేసిన 'పెళ్లిసందD' ట్రైలర్!

22-09-2021 Wed 11:26
  • తెలుగు తెరపై మరోసారి 'పెళ్లి సందD'
  • కథానాయికగా శ్రీలీల పరిచయం 
  • తెరపై సందడి చేయనున్న భారీతారాగణం
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు  
Mahesh Babu launched PelliSandaD trailer
శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా 'పెళ్లిసందD' సినిమా రూపొందింది. ఆర్కే ఫిల్మ్ అసోసియేట్ .. ఆర్కా మీడియా వారు ఈ సినిమాను నిర్మించారు. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరీ రోణంకి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో తెలుగు తెరకి శ్రీలీల కథానాయికగా పరిచయమవుతోంది.

రాఘవేంద్రరావు ఒక ప్రత్యేకమైన పాత్రను పోషించిన ఈ సినిమా నుంచి, మహేశ్ బాబు చేతుల మీదుగా ఒక ట్రైలర్ ను రిలీజ్ చేయించారు. రాఘవేంద్రరావు గారు తొలిసారిగా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి చాలా సంతోషంగా ఉంది అంటూ, మహేశ్ ఈ సినిమా టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పాడు.

లవ్ .. రొమాన్స్ .. యాక్షన్ .. ఎమోషన్ సీన్స్ పై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాజేంద్ర ప్రసాద్ .. ప్రకాశ్ రాజ్ .. రావు రమేశ్ .. పోసాని .. వెన్నెల కిషోర్ వంటి భారీ తారాగణం భారీ స్థాయిలో సందడి చేసినట్టుగానే అనిపిస్తోంది. లుక్ పరంగాను .. డాన్స్, ఫైట్స్ పరంగాను రోషన్ మంచి మార్కులు కొట్టేసేలానే కనిపిస్తున్నాడు