జీహెచ్ఎంసీలో సికింద్రాబాద్ కంటోన్మెంటును విలీనం చేయాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు: కేటీఆర్

22-09-2021 Wed 11:14
  • విలీనం చేయాల‌న్న వాద‌న‌ల‌తో నేను కూడా ఏకీభ‌విస్తున్నాను
  • దీనిపై మీ అభిప్రాయాల‌ను చెప్పండంటూ కేటీఆర్ ట్వీట్
  • విలీనం చేయాలంటోన్న నెటిజ‌న్లు
ktr on secunderabad cantonment merge
గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (జీహెచ్ఎంసీ)లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ను విలీనం చేయాల‌న్న సూచ‌న‌ల‌పై తెలంగాణ మంత్రి  కేటీఆర్ స్పందించారు.  "జీహెచ్ఎంసీలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ను విలీనం చేయాల‌ని చాలా మంది ప్ర‌జ‌లు కోరుతున్నారు. విలీనం చేయాల‌న్న వాద‌న‌ల‌తో నేను కూడా ఏకీభ‌విస్తున్నాను. దీనిపై మీ అభిప్రాయాల‌ను చెప్పండి" అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

దీనిపై నెటిజ‌న్లు త‌మ అభిప్రాయాల‌ను రిప్లై రూపంలో తెలుపుతున్నారు.  సికింద్రాబాద్ కంటోన్మెంట్ ను విలీనం చేయాల‌న్న సూచ‌న‌లు స‌రైన‌వేన‌ని చెబుతున్నారు. విలీనం చేస్తే బాగుంటుంద‌ని కోరుతున్నారు.