చిరూ చేతుల మీదుగా 'రిపబ్లిక్' ట్రైలర్!

22-09-2021 Wed 11:02
  • నిజాయతీ పరుడైన కలెక్టర్ గా సాయితేజ్
  • పవర్ఫుల్ పొలిటికల్ లీడర్ గా రమ్యకృష్ణ
  • అవినీతి రాజకీయాల చుట్టూ అల్లిన కథ
  • అక్టోబర్ 1వ తేదీన విడుదల  
Republc trailer released
సాయితేజ్ కథానాయకుడిగా దేవ కట్టా దర్శకత్వంలో 'రిపబ్లిక్' సినిమా రూపొందింది. భగవాన్ - పుల్లారావు నిర్మించిన ఈ సినిమాలో, సాయితేజ్ జోడీగా ఐశ్వర్య రాజేశ్ అలరించనుంది. మణిశర్మ అందించిన బాణీలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్టోబర్ 1వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి చిరంజీవి చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేయించారు. "సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. 'రిపబ్లిక్' చిత్రం అక్టోబర్ 1వ తారీఖున విడుదల చేస్తే బాగుంటుందన్న తన కోరిక మేరకు అదే తేదీన విడుదలవుతోంది. మీ ఆదరణ .. అభిమానం .. ప్రేమే సాయిధరమ్ తేజ్ కి శ్రీరామ రక్ష" అంటూ చిరంజీవి ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

రాజకీయనాయకురాలిగా రమ్యకృష్ణ ..  కలెక్టర్ గా సాయితేజ్ సవాళ్లు విసురుకోవడంపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ''అజ్ఞానం గూడు కట్టిన చోటే మోసం గుడ్లు పెడుతుంది కలెక్టర్" అంటూ రమ్యకృష్ణ చెప్పిన డైలాగ్ బాగా పేలింది. అవినీతి రాజకీయాలు వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తున్నాయనేదే ఈ సినిమా కథ అనే విషయం, ఈ  ట్రైలర్ ను బట్టి స్పష్టమవుతోంది.