ప్రకాశం జిల్లా యనమదల వైసీపీ ఎంపీటీసీ అదృశ్యం.. గాలిస్తున్న పోలీసులు

22-09-2021 Wed 08:30
  • ఎంపీపీ పదవి కోసం వైసీపీలో రెండు వర్గాల మధ్య పోటీ
  • సోమవారం నుంచి తన భర్త కనిపించడం లేదంటూ శాంసన్ భార్య ఫిర్యాదు
  • పార్టీలో చర్చనీయాంశం
Prakasam dist yanamadala ysrcp mptc missing

ప్రకాశం జిల్లా యనమదల వైసీపీ ఎంపీటీసీ శాంసన్ అదృశ్యమైన ఘటన స్థానికంగా సంచలనమైంది. ఆయన భార్య పరమగీతం ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు శాంసన్ కోసం గాలిస్తున్నారు. యద్దనపూడి ఎంపీపీ పదవి కోసం వైసీపీలో రెండు వర్గాలు తీవ్రంగా పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో శాంసన్ అకస్మాత్తుగా కనిపించకుండా పోవడం పార్టీలో చర్చనీయాంశమైంది. తన భర్త శాంసన్ సోమవారం నుంచి కనిపించడం లేదంటూ ఆయన భార్య యద్దనపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.