సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

22-09-2021 Wed 07:24
  • హాస్యనటుడి సినిమాలో కీర్తి సురేశ్ 
  • నవంబర్ నుంచి మహేశ్ కొత్త సినిమా
  • ఓటీటీ వైపు చూస్తున్న 'రంగమార్తాండ'
Keerti Suresh signs for a Tamil movie

*  ప్రస్తుతం తెలుగులో మహేశ్ బాబు సరసన 'సర్కారువారి పాట' చిత్రంలో నటిస్తున్న కథానాయిక కీర్తి సురేశ్ తాజాగా తమిళంలో ఓ చిత్రాన్ని అంగీకరించినట్టు సమాచారం. విశేషం ఏమిటంటే, ఇందులో ప్రముఖ హాస్యనటుడు వడివేలు కథానాయకుడుగా నటిస్తాడు. అయితే, కీర్తి అతనికి జంటగా నటించదనీ, ఆమెది కీలక పాత్ర అనీ తెలుస్తోంది.
*  మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే చిత్రం షూటింగ్ నవంబర్ నుంచి జరుగుతుంది. ముందుగా ఒక పాటను, ఒక యాక్షన్ దృశ్యాన్ని చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషించనున్నారు.
*  ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ రూపొందిస్తున్న 'రంగమార్తాండ' చిత్రం షూటింగ్ దాదాపు పూర్తికావచ్చింది. కాగా, మంచి ఆఫర్ వస్తే కనుక, ఈ చిత్రాన్ని ఓటీటీ వేదికగా విడుదల చేయడానికి మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.