బిగ్ బాస్ షో స్క్రిప్టు కాదు... రియల్ షో: ఉమాదేవి

21-09-2021 Tue 20:31
  • రెండోవారంలో ఎలిమినేట్ అయిన ఉమాదేవి
  • తన ఎలిమినేషన్ పట్ల విచారం వ్యక్తం చేసిన నటి
  • తన మాటతీరు పట్ల పొరబడ్డారని వెల్లడి
  • చాన్స్ వస్తే మళ్లీ వెళతానని ఆశాభావం!
Tollywood actress Umadevi opines on Bigg Boss show

బిగ్ బాస్ ఐదో సీజన్ రసవత్తరంగా నడుస్తోంది. గత వారం బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అయిన టాలీవుడ్ నటి ఉమాదేవి తాజాగా సోషల్ మీడియాలో తన అనుభవాలను పంచుకున్నారు. బిగ్ బాస్ షో ఓ స్క్రిప్టు ప్రకారం నడుస్తుందని చాలామంది భావిస్తుంటారని, అందులో నిజంలేదని స్పష్టం చేసింది. బిగ్ బాస్... నికార్సయిన గేమ్ షో అని పేర్కొంది.

ఇక తన ఎలిమినేషన్ పట్ల ఉమాదేవి విచారం వ్యక్తం చేసింది. తాను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతానని, కానీ బిగ్ బాస్ ఇంటి సభ్యులు తన మాటతీరును సరిగా అర్థం చేసుకోలేకపోయారని అభిప్రాయపడింది. బిగ్ బాస్ ఇంట్లో ఉండుంటే ఇంకా వినోదం పంచేదాన్నని, రెండో వారానికే ఎలిమినేట్ కావడం బాధాకరమని పేర్కొంది. అవకాశం ఇస్తే మళ్లీ బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లడానికి సిద్ధమేనని ప్రకటించింది.