ఇంగ్లండ్ లో పర్యటిస్తున్న కివీస్ మహిళల క్రికెట్ జట్టుకు బాంబు బెదిరింపులు

21-09-2021 Tue 20:03
  • ఇటీవల పాక్ పర్యటన రద్దు చేసుకున్న న్యూజిలాండ్
  • నేడు ఇంగ్లండ్, న్యూజిలాండ్ మహిళల మూడో వన్డే
  • మ్యాచ్ కు ముందు బెదిరింపు ఈమెయిల్
  • నమ్మదగ్గ విధంగా లేదన్న కివీస్, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులు
Bomb threat for New Zealand women cricket team

ఇటీవల న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భద్రతా కారణాల రీత్యా పాకిస్థాన్ పర్యటనను చివరి నిమిషంలో రద్దు చేసుకున్న నేపథ్యంలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇంగ్లండ్ లో పర్యటిస్తున్న న్యూజిలాండ్ మహిళల క్రికెట్ జట్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. ఇవాళ న్యూజిలాండ్, ఇంగ్లండ్ మహిళల మూడో వన్డేకు కొద్దిముందుగా ఓ ఈమెయిల్ ద్వారా ఈ బెదిరింపులు వచ్చాయి. న్యూజిలాండ్ మహిళా క్రికెటర్లు ఉంటున్న హోటల్ ను పేల్చివేస్తామన్నది ఆ ఈమెయిల్ సారాంశం.

న్యూజిలాండ్ జట్టు మేనేజ్ మెంట్ లోని ఓ అధికారికి ఈ బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. అయితే ఇరుదేశాల క్రికెట్ బోర్డులు దీన్ని ఏమంత సీరియస్ గా పట్టించుకోలేదు. ఆ బెదిరింపు ఈమెయిల్ ఏమంత నమ్మశక్యంగా లేదని న్యూజిలాండ్, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులు తేలిగ్గా తీసుకున్నాయి లీసెస్టర్ లో ఇరు జట్ల మధ్య మ్యాచ్ యథావిధిగా ప్రారంభమైంది.