ఐపీఎల్: రాజస్థాన్ రాయల్స్ పై టాస్ గెలిచిన పంజాబ్

21-09-2021 Tue 19:36
  • ఐపీఎల్ లో నేడు రాజస్థాన్ వర్సెస్ పంజాబ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్
  • పాయింట్ల పట్టికలో 6,7 స్థానాల్లో ఉన్న రాజస్థాన్, పంజాబ్
  • ఇరుజట్లకు నేటి మ్యాచ్ కీలకం
Punjab Kings won the toss

ఐపీఎల్ లో నేడు రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం ఈ పోరుకు వేదికగా నిలుస్తోంది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పాయింట్ల పట్టికను ఓసారి పరిశీలిస్తే... రాజస్థాన్ రాయల్స్ 7 మ్యాచ్ లు ఆడి 3 విజయాలు, 4 ఓటములతో ఆరోస్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ 8 మ్యాచ్ ల్లో 3 విజయాలు, 5 ఓటములతో ఏడో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇరుజట్లకు నేటి మ్యాచ్ ఎంతో కీలకం కానుంది.