MLC Ramesh: బాలాపూర్ వినాయకుడి లడ్డూను సీఎం జగన్ కు అందించిన ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్

MLC Ramesh Yadav gifted Balapur laddu to AP CM Jagan
  • ఇటీవల బాలాపూర్ లడ్డూ వేలం
  • రూ.18.90 లక్షలకు దక్కించుకున్న రమేశ్ యాదవ్
  • సీఎం జగన్ కు కానుకగా ఇస్తానని ప్రకటన
  • చెప్పినట్టుగానే లడ్డూ సీఎంకు అందజేత
తెలంగాణలో వినాయక చవితి అంటే బాలాపూర్ పేరు తప్పకుండా వినిపిస్తుంది. గత కొన్నేళ్లుగా అక్కడి వినాయకుడి లడ్డూ తెలంగాణలో అత్యధిక ధర సొంతం చేసుకోవడం తెలిసిందే. ఈ సంవత్సరం బాలాపూర్ లడ్డూను ఏపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ సొంతం చేసుకోవడం విశేషం.

తన స్నేహితుడు, అబాకస్ విద్యాసంస్థల అధినేత మర్రి శశాంక్ రెడ్డితో కలిసి వేలంపాటలో పాల్గొన్న ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ రూ.18.90 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తాము వేలంలో దక్కించుకున్న లడ్డూను ఏపీ సీఎం జగన్ కు కానుకగా అందిస్తామని చెప్పారు. చెప్పినట్టుగానే నేడు ఆ భారీ లడ్డూను సీఎం జగన్ కు బహూకరించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన రమేశ్ యాదవ్ లడ్డూను సీఎం జగన్ కు అందించారు.

కాగా, సీఎం జగన్ కు ప్రఖ్యాతిచెందిన బాలాపూర్ లడ్డూను గిఫ్టుగా ఇవ్వడం కోసమే తాను వేలంపాటలో పాల్గొన్నానని రమేశ్ యాదవ్ తెలిపారు. కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ అభిమానం పట్ల సీఎం జగన్ ముగ్ధుడయ్యారు. ఈ సందర్భంగా రమేశ్ యాదవ్ కుటుంబ సభ్యులు కూడా సీఎం జగన్ ను కలిశారు.
MLC Ramesh
CM Jagan
Balapur Laddu
Gift

More Telugu News