స్పోర్టీ లుక్ తో కొత్త స్కూటర్ ను తీసుకువచ్చిన యమహా... ధర లక్ష పైనే!

21-09-2021 Tue 18:59
  • ఏరోక్స్ 155 పేరిట నయా స్కూటర్
  • ఎక్స్ షోరూం ధర రూ.1.29 లక్షలు
  • 155 సీసీ బ్లూ కోర్ ఇంజిన్ తో శక్తిమంతం
  • బ్లూటూత్ అనుసంధానత
  • ఎల్సీడీ క్లస్టర్ అదనపు ఆకర్షణ
Yamaha introduces new scooter Aerox

జపాన్ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం యమహా భారత మార్కెట్లో సరికొత్త స్కూటర్ ను తీసుకువచ్చింది. దీని పేరు ఏరోక్స్ 155. కుర్రకారును ఇట్టే ఆకర్షించేలా స్పోర్టీ లుక్ తో దర్శనమిస్తున్న ఈ నయా స్కూటర్ ధర లక్ష పైనే ఉంది. ఢిల్లీ ఎక్స్ షోరూం ధర రూ.1.29 లక్షలుగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ స్కూటర్లను యమహా ప్లాంట్ ల నుంచి షోరూంలకు తరలిస్తున్నారు.

ఏరోక్స్ 155 రెండు రంగుల్లో వస్తోంది. రేసింగ్ బ్లూ, గ్రే వెర్మిలియన్ కలర్స్ లో వస్తున్న ఈ స్కూటర్ కు 155 సీసీ ఇంజిన్ అమర్చారు. ఇది లిక్విడ్ కూల్డ్ 4 స్ట్రోక్ ఇంజిన్. అండర్ సీట్ ఫ్యూయెల్ ట్యాంక్ ఇచ్చారు. దీని కెపాసిటీ 24.5 లీటర్.

ఇది బ్లూటూత్ ఎనేబుల్డ్ స్కూటర్. యమహా మోటార్ సైకిల్ కనెక్ట్ యాప్ తో అనుసంధానం కావొచ్చు. లిక్విడ్ క్రిస్టల్ డిస్ ప్లే క్లస్టర్ అదనపు ఆకర్షణ. యమహా ఏరోక్స్ స్కూటర్లు అక్టోబరు నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది.