రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు టీఆర్ఎస్ కార్యకర్తల యత్నం.. ఉద్రిక్తత

21-09-2021 Tue 18:39
  • రేవంత్, కేటీఆర్ ల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం
  • ముట్టడికి యత్నించిన టీఆర్ఎస్ శ్రేణులను అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు
  • ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు
Congress workers tried to attack Revanth Reddys house

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మంత్రి కేటీఆర్ ల మధ్య నెలకొన్న వివాదం తెలంగాణ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. ఈ ఇద్దరు నేతల మధ్య వివాదం రెండు పార్టీల మధ్య వివాదంగా మారింది. ఇరు పార్టీలకు చెందిన నేతలు కూడా ఒకరిపై మరొకరు విమర్శలు సంధించుకుంటున్నారు.

తాజాగా కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రేవంత్ రెడ్డి నివాసాన్ని టీఆర్ఎస్ కార్యకర్తలు ముట్టడించేందుకు యత్నించారు. వారి ప్రయత్నాన్ని రేవంత్ ఇంటి వద్ద ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అయితే శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వెళ్లిన తమపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేశాయని టీఆర్ఎస్ కార్యకర్తలు అంటున్నారు. ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు అక్కడి పరిస్థితిని చక్కదిద్దారు.