'రాజా విక్రమార్క' నుంచి ఫస్టు సింగిల్ రిలీజ్!

21-09-2021 Tue 18:36
  • NIA ఆఫీసర్ గా కార్తికేయ 
  • దర్శకుడిగా శ్రీ సరిపల్లి పరిచయం 
  • సంగీత దర్శకుడిగా ప్రశాంత్ విహారి 
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు
Raja Vikramarka first single released

కార్తికేయ కథానాయకుడిగా శ్రీ సరిపల్లి దర్శకత్వంలో 'రాజా విక్రమార్క' సినిమా రూపొందింది. 88 రామారెడ్డి నిర్మించిన ఈ సినిమాలో, కార్తికేయ సరసన తాన్య రవిచంద్రన్ మెరవనుంది. ఈ రోజున కార్తికేయ పుట్టినరోజు .. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ గా లిరికల్ వీడియోను వదిలారు.

'రాజాగారు బయటికొస్తే ప్రమాదమే ప్రయాసతో పరారు అంతే, రాజాగారు బయటికొస్తే భుజాలపై షికారులే ఖరారు అంతే ' అంటూ ఈ పాట సాగుతోంది. కార్తికేయ ఈ సినిమాలో NIA ఆఫీసర్ గా కనిపించనున్నాడు. అందువలన అందుకు సంబంధించిన యాక్షన్ స్టిల్స్ పై ఈ ట్రైలర్ ను కట్ చేశారు.

ప్రశాంత్ విహారి సంగీతం .. కృష్ణకాంత్ సాహిత్యం .. డేవిడ్ సైమన్ ఆలాపన ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాలో కూడా కార్తికేయ శత్రువులను వెంటాడుతున్నప్పుడు .. వేటాడుతున్నప్పుడు ఈ సాంగ్ ప్లే అవుతుందనే అనుకోవాలి. ఆ తరహాలోనే దీనిని కంపోజ్ చేశారు. కొంతకాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న కార్తికేయకి ఈ సినిమా ఎంతవరకూ కలిసొస్తుందో చూడాలి.