మార్నింగ్ వాక్ లో.. ​ఓ మహిళ అడిగిన ప్రశ్నకు సిగ్గుపడిన సీఎం స్టాలిన్

21-09-2021 Tue 18:36
  • ఫిట్ నెస్ కు ప్రాధాన్యతనిచ్చే స్టాలిన్
  • ప్రతిరోజూ కసరత్తులు
  • క్రమం తప్పకుండా మార్నింగ్ వాక్
  • మార్నింగ్ వాక్ సందర్భంగా ప్రజలతో మాటామంతీ
CM Stalin felt blushing after woman questioned about his young look

ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యత ఇచ్చే రాజకీయనేతల్లో తమిళనాడు సీఎం స్టాలిన్ ఒకరు. ఆయన ప్రతిరోజు జిమ్ లో చెమటోడ్చుతూ, ఆరోగ్యంగా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంటారు. క్రమం తప్పకుండా మార్నింగ్ వాక్ చేస్తుంటారు. ఎప్పట్లాగానే మార్నింగ్ వాక్ కు వెళ్లిన సీఎం స్టాలిన్ ఓ మహిళ అడిగిన ప్రశ్నతో కాస్త సిగ్గుపడ్డారు.

మీరు చాలా యంగ్ గా కనిపిస్తున్నారు... మీ ఆరోగ్య రహస్యం ఏమిటి? అని ఆమె అడిగింది. దాంతో అక్కడున్న వారందరూ ఫక్కున నవ్వారు. దాంతో కొంచెం ఇబ్బందిగా ఫీలైన స్టాలిన్ తాను కూడా వారితో కలిసి నవ్వేశారు. ఆపై ఆమెకు బదులిస్తూ, డైట్ కంట్రోల్ వల్లే తానింత ఫిట్ గా ఉన్నానని తెలిపారు. కాగా, మార్నింగ్ వాక్ కు వెళ్లిన సందర్భంగా ప్రజలతో ముచ్చటించిన స్టాలిన్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సూచనలు, సలహాలు స్వీకరించారు.