కేటీఆర్ పరువునష్టం దావా: రేవంత్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసిన న్యాయస్థానం

21-09-2021 Tue 18:12
  • డ్రగ్స్ వ్యవహారంలో కేటీఆర్ పై రేవంత్ వ్యాఖ్యలు
  • కోర్టును ఆశ్రయించిన కేటీఆర్
  • రేవంత్ పై పరువునష్టం దావా
  • నేడు విచారణ జరిపిన కోర్టు
City civil court issues injunction order in KTR defamation suit

డ్రగ్స్ వ్యవహారంలో తనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి కేటీఆర్ పరువునష్టం దావా వేయడం తెలిసిందే. దీనిపై నేడు విచారణ జరిపిన సిటీ సివిల్ కోర్టు ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చింది. డ్రగ్స్, ఈడీ కేసుల్లో కేటీఆర్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని రేవంత్ రెడ్డిని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే నెల 20కి వాయిదా వేసింది.

డ్రగ్స్ నేపథ్యంలో కొన్నిరోజుల కిందట రేవంత్ రెడ్డి స్పందిస్తూ, మంత్రి కేటీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. కేటీఆర్ డ్రగ్స్ టెస్టు చేయించుకుని తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని వైట్ చాలెంజ్ విసిరారు. అందుకు దీటుగా బదులిచ్చిన కేటీఆర్, ఆపై రేవంత్ మీద పరువునష్టం దావా వేశారు.