నడుస్తూ సొమ్మసిల్లి పడిపోయిన ఎమ్మెల్యే సీతక్క... ఆసుపత్రికి తరలింపు

21-09-2021 Tue 17:45
  • ఏటూరునాగారంలో కాంగ్రెస్ దండోరా యాత్ర
  • పాల్గొన్న ఎమ్మెల్యే సీతక్క
  • అస్వస్థతకు గురైన వైనం
  • ఆసుపత్రికి తరలించిన నేతలు
  • బీపీ తగ్గడంతో నీరసించారన్న వైద్యులు
MLA Seethakka hospitalized

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే ధనసరి సీతక్క అస్వస్థత కారణంగా ఆసుపత్రి పాలయ్యారు. ఆమె ఇవాళ ములుగు జిల్లా ఏటూరునాగారంలో దళిత గిరిజన దండోరా యాత్రలో పాల్గొన్నారు. ఈ యాత్రలో సీతక్క నడుస్తూనే ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే స్పందించిన కాంగ్రెస్ నేతలు సీతక్కను వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బీపీ తగ్గడంతో ఆమె నీరసించారని, చికిత్స అనంతరం ఆమె కోలుకున్నారని ప్రభుత్వాసుపత్రి వైద్యులు వెల్లడించారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం ఆమె తేరుకున్నారని తెలిపారు.  దాంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.