కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: కొడాలి నాని

21-09-2021 Tue 17:26
  • ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల వెల్లడి
  • వైసీపీ ఘనవిజయం సాధించిందన్న కొడాలి నాని
  • జగన్ ను ప్రజలు దీవిస్తున్నారని వెల్లడి
  • చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని వ్యాఖ్యలు
  • ఈసారి చంద్రబాబును ఓడిస్తామని ధీమా
Kodali Nani comments after Parishat elections victory

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జడ్పీటీసీల్లో 99 శాతం, ఎంపీటీసీల్లో 85 శాతం వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారని వెల్లడించారు. కుప్పం, నారావారిపల్లె, నిమ్మకూరులోనూ వైసీపీదే విజయం అని స్పష్టం చేశారు. జగన్ ను ప్రజలు దీవిస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నాడని కొడాలి నాని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి అభ్యర్థులు దొరికే పరిస్థితి ఉండదని అన్నారు. కుప్పంలో చంద్రబాబుకు ఓటమి ఖాయమని, ఒకవేళ చంద్రబాబు కుప్పంలో గెలిస్తే తాను రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని నాని ఛాలెంజ్ చేశారు.