AP Aseembly: అచ్చెన్న, నిమ్మలకు ఇక అసెంబ్లీలో మైక్ కట్... ప్రివిలేజ్ కమిటీ కీలక నిర్ణయం!

AP Assembly Privilege Committee decision
  • అచ్చెన్న, నిమ్మలపై చీఫ్ విప్ ఫిర్యాదు
  • సభను తప్పుదోవ పట్టించారని ఆరోపణ
  • విచారించిన ప్రివిలేజ్ కమిటీ
  • ఆరోపణలు నిజమేనని కమిటీ ఏకాభిప్రాయం
  • చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్ కు సిఫారసు
ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడులకు అసెంబ్లీలో మైక్ ఇవ్వరాదని నిర్ణయించింది. ఈమేరకు అసెంబ్లీ స్పీకర్ కు ప్రివిలేజ్ కమిటీ సిఫారసు చేసింది. అచ్చెన్నాయుడు, నిమ్మల సభను తప్పుదోవ పట్టించారన్న చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఫిర్యాదుపై చర్చించేందుకు నేడు చైర్మన్ కాకాణి గోవర్ధన్ నేతృత్వంలో ప్రివిలేజ్ కమిటీ సమావేశమైంది.

మద్యం షాపుల విషయంలో అచ్చెన్నాయుడు, వృద్ధాప్య పెన్షన్ల విషయంలో నిమ్మల రామానాయుడు సభను తప్పుదోవ పట్టించారని కమిటీ అభిప్రాయపడింది. ఈ అంశంపై చర్చించిన కమిటీ తుది నిర్ణయం తీసుకుంది. కాగా, స్పీకర్ ను దూషించారన్న ఫిర్యాదు విషయంలో ప్రివిలేజ్ కమిటీ అచ్చెన్నాయుడిని క్షమించింది. అచ్చెన్న ఈ విషయంలో గతంలోనే క్షమాపణలు చెప్పారు.
AP Aseembly
Privilege Committee
Kakani Govardhan
Atchannaidu
Nimmala Rama Naidu

More Telugu News