జేమ్స్‌బాండ్ కారు కొనుక్కోవాలంటే ఇదే ఛాన్స్

  • గన్నులు కూడా అమర్చి మరీ అమ్మకానికి పెట్టిన కంపెనీ
  • ‘నో టైం టు డై’ సినిమా కోసం తయారుచేసిన డీబీ5 జూనియర్ కారు
  • 90 వేల డాలర్లకు అమ్మనున్న ఆస్టన్ మార్టిన్ కంపెనీ
James Bond movie car for sale by Auston Martin

జేమ్స్‌బాండ్ సినిమాల్లో కథానాయకుడు నడిపే కార్లు ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంటాయి. అధునాతనంగా ఉండే ఇలాంటి కారును అమ్మకానికి పెట్టిందో ప్రముఖ కార్ల కంపెనీ. జేమ్స్‌బాండ్ సినిమాల్లో కనిపించే కార్లన్నీ ఆస్టన్ మార్టిన్ కంపెనీ నుంచే వస్తాయి. కొత్తగా విడుదలకు సిద్ధమవుతున్న ‘నో టైం టు డై’ చిత్రంలో కూడా జేమ్స్‌బాండ్ కోసం ఒక ప్రత్యేకమైన కారును సిద్ధం చేశారు. దీన్ని డీబీ 5 జూనియర్ అని పిలుస్తోందా కంపెనీ.

ఎలక్ట్రిక్ వాహనంగా సిద్ధమైన ఈ కారును ఒక్కసారి చార్జ్ చేస్తే 80 మైళ్లు ప్రయాణం చేసేయొచ్చు. ఈ కారును అమ్మకానికి పెట్టింది ఆస్టన్ మార్టిన్ కంపెనీ. ఒక్కో కారు ధరను 90 వేల డాలర్లుగా నిర్ణయించింది. అయితే దీన్ని అందరూ కొనుగోలు చేయలేరు. కేవలం ఆస్టన్ మార్టన్ సభ్యత్వం ఉన్నవారు మాత్రమే కొనుగోలు చేయగలరు.

మొత్తమ్మీద 125 డీబీ 5 జూనియర్ కార్లను అమ్మడానికి ఆస్టిన్ మార్టన్ కంపెనీ సిద్ధమైంది. అయితే ఈ కంపెనీ సభ్యత్వం ఉండి, కారును కొనుగోలు చేసినా కూడా దీనిలో రోడ్డుపై షికార్లు చేయడం కుదరదు. ఎందుకంటే దీనికి అనుమతులు లేవు. ఈ కారులో డిజిటల్ నంబర్ ప్లేటు ఉంటుంది. అంటే ఒక స్విచ్ నొక్కగానే కారు నంబర్ మారిపోతుంది. అలాగే స్విచ్ నొక్కగానే కారు హెడ్‌లైట్స్ స్థానంలో గన్నులు వచ్చి గుళ్ల వర్షం కురిపిస్తాయి. దీన్ని ప్రత్యేక కార్యక్రమాల్లో, రేస్‌ట్రాక్‌లపై నడపడానికి అనుమతులు ఉన్నాయి.

More Telugu News