ఫోన్లు, హార్డ్​ డ్రైవ్​ లో నీలి చిత్రాలు.. రూ.9 కోట్లకు రాజ్​ కుంద్రా బేరం పెట్టాడు: క్రైం బ్రాంచ్​ పోలీసుల వెల్లడి

21-09-2021 Tue 14:43
  • 119 బ్లూ ఫిల్మ్స్ ఉన్నాయని సంచలన ఆరోపణ
  • ఇవాళే బెయిల్ పై విడుదలైన రాజ్ కుంద్రా
  • అంతలోనే వివరాలు వెల్లడించిన అధికారులు
Crime Branch Says They Found 119 Blue Films In Kundra Phone and Laptops

రెండు నెలల పాటు పోలీసుల కస్టడీలో ఉండి ఇవాళే జైలు నుంచి విడుదలైన రాజ్ కుంద్రాపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సంచలన ఆరోపణలు చేశారు. విచారణలో భాగంగా రాజ్ కుంద్రా ఫోన్, ల్యాప్ టాప్, హార్డ్ డ్రైవ్ లను పరిశీలించామని, అందులో 119 బ్లూ ఫిల్మ్స్ ఉన్నాయని చెప్పారు. వాటిని రూ.9 కోట్లకు కుంద్రా బేరానికి పెట్టారని వెల్లడించారు. కాగా, పోర్న్ సినిమాలు తీస్తున్నారన్న ఆరోపణలతో జూన్ లో రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ముంబై శివారులోని మాద్ దీవిలో పోర్న్ సినిమా చిత్రీకరణ జరుగుతోందన్న సమాచారంపై పోలీసులు రైడ్ చేశారని, అక్కడ నగ్నంగా ఉన్న ఇద్దరు వ్యక్తులతో పాటు 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారని అధికారులు చెప్పారు. ఐదు నెలల దర్యాప్తు అనంతరం పోర్న్ గుట్టును బయటపెట్టారని, పక్కా ఆధారాలతోనే హాట్ షాట్స్ ను నిర్వహిస్తున్న కుంద్రాను అరెస్ట్ చేశారని చెప్పారు.