చిన్నారి ప్రాణం తీసిన విక్స్​ డబ్బా

21-09-2021 Tue 14:32
  • డబ్బాను నోట్లో పెట్టుకున్న ఏడు నెలల చిన్నారి
  • గొంతుకు అడ్డం పడి ఊపిరికి అడ్డంకి
  • ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మృతి
7 month old kid dies due to Vicks box struck in throat

నల్గొండ జిల్లా నార్కట్ పల్లిలో దారుణం జరిగింది. విక్స్ డబ్బా ఓ పసికందు ప్రాణాన్ని బలిగొంది. నార్కట్ పల్లి మండలం తొండ్లాయి గ్రామంలో ఏడు నెలల చిన్నారి ఆడుకుంటూ వెళ్లి ఇంట్లో ఉన్న విక్స్ డబ్బాను నోట్లో పెట్టుకున్నాడు. అది కాస్తా గొంతుకు అడ్డం పడింది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే, మార్గమధ్యంలోనే ఆ చిన్నారి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.