ఆర్థర్ రోడ్ జైలు నుంచి బయటకు వచ్చిన శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా

21-09-2021 Tue 13:55
  • రెండు నెలల తర్వాత స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న రాజ్ కుంద్రా
  • నిన్న కుంద్రాకు బెయిల్ మంజూరు చేసిన ముంబై కోర్టు
  • పోర్నోగ్రఫీ కేసులో జులై 19న అరెస్టయిన కుంద్రా
Actor Shilpa Shettys Husband Raj Kundra Walks Out Of Jail

ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా దాదాపు రెండు నెలల తర్వాత స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నాడు. నీలి చిత్రాల నిర్మాణం కేసులో అరెస్ట్ అయిన కుంద్రాకు నిన్న ముంబైలోని కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. రూ. 50 వేల పూచీకత్తుతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అన్ని ఫార్మాలిటీలు ముగిసిన తర్వాత కాసేపటి క్రితం ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలు నుంచి ఆయన విడుదలయ్యారు.

గత జులై 19న కుంద్రాతో పాటు ఆయన సహచరుడు ర్యాన్ థోర్పేను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో విచారణ పూర్తయి, ఛార్జిషీటు దాఖలు చేసినందున బెయిల్ మంజూరు చేయాలని శనివారంనాడు కోర్టును ఆయన కోరారు. ఈ కేసులో తనను బలిపశువును చేశారని, తప్పుగా తనను కేసులో ఇరికించారని, పోర్న్ చిత్రాల షూటింగులో తన ప్రమేయం ఉన్నట్టు ఆధారాలు లేకపోయినా తనపై ఛార్జిషీటు దాఖలు చేశారని బెయిల్ పిటిషన్ లో కుంద్రా పేర్కొన్నారు.