ఖాకీ డ్రెస్సు విప్పేసి వైసీపీ చొక్కాలు వేసుకుంటే బాగుంటుంది: ధూళిపాళ్ల‌

21-09-2021 Tue 13:29
  • టీడీపీ శ్రేణుల‌పై దాడులు పెరిగిపోతున్నాయి
  • పోలీసులు ప్రేక్ష‌కపాత్ర వ‌హిస్తున్నారు
  • గుంటూరు జిల్లాలో పోలీసు వ్య‌వ‌స్థ పూర్తిగా విఫలం
dhulipalla slams ysrcp

టీడీపీ శ్రేణుల‌పై దాడులు పెరిగిపోతున్నాయంటూ ఆ పార్టీ నేత ధూళిపాళ్ల న‌రేంద్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పోలీసులు ఖాకీ డ్రెస్సు విప్పేసి వైసీపీ చొక్కాలు వేసుకుంటే బాగుంటుంద‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లాలో పోలీసు వ్య‌వ‌స్థ పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని ఆయ‌న ఆరోపించారు. ఆ ప్రాంతంలో విచ్చ‌ల‌విడిగా పేకాట శిబిరాలు ఉంటున్నాయ‌ని, గుట్కా వ్యాపారాలు కొన‌సాగుతున్నాయని ఆయ‌న ఆరోపించారు.

జిల్లాలో గంజాయి దొర‌క‌ని ప్రాంత‌మంటూ ఏదీ లేద‌ని ఆయ‌న ఆరోప‌ణ‌లు గుప్పించారు. గుంటూరులో ఫ్యాక్ష‌న్ మూక‌లు రెచ్చిపోతున్నప్ప‌టికీ, పోలీసులు ప్రేక్ష‌క‌పాత్ర వ‌హిస్తూ చూస్తూ ఊరుకుంటున్నార‌ని ఆయ‌న అన్నారు. కొప్ప‌ర్రులో టీడీపీ నాయ‌కురాలు ఇంటిపై దాడి జ‌ర‌గ‌డాన్ని ఖండిస్తున్నాన‌ని ఆయ‌న చెప్పారు. దాడులు జ‌రుపుతోన్న వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.