రేపు మహేశ్ బాబు చేతుల మీదుగా 'పెళ్లి సందD' ట్రైలర్!

21-09-2021 Tue 12:00
  • రోషన్ హీరోగా రూపొందిన 'పెళ్లి సందD'
  • కథానాయికగా శ్రీలీల పరిచయం
  • రేపు ఉదయం 11 గంటలకు ట్రైలర్ రిలీజ్
  • ముఖ్యమైన పాత్రలో రాఘవేంద్రరావు  
Pelli Sandadi trailer will be launched by Mahesh Babu

రోషన్ హీరోగా 'పెళ్లి సందD' సినిమా రూపొందింది. ఆర్కా మీడియావారు నిర్మించిన ఈ సినిమాతో, గౌరీ రోణంకి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. గతంలో శ్రీకాంత్ తో 'పెళ్లి సందడి' చేసి భారీ విజయాన్ని అందుకున్న రాఘవేంద్రరావు, ఈ సినిమాకి దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. అంతేకాదు ఒక ముఖ్యమైన పాత్రను కూడా పోషించారు.

గతంలో ఆయనతో 'పెళ్లి సందడి' సినిమాకి పనిచేసిన కీరవాణి - చంద్రబోస్ ఈ సినిమాకి కూడా పనిచేయడం విశేషం. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన అప్ డేట్స్ ఆసక్తిని పెంచుతూ వెళుతున్నాయి. ఇక ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

రేపు ఉదయం 11 గంటలకు మహేశ్ బాబు చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేయించనున్నారు. ఈ సినిమాతో శ్రీలీల తెలుగు తెరకి కథానాయికగా పరిచయమవుతోంది. శ్రీకాంత్ మాదిరిగానే ఆయన తనయుడికి ఈ టైటిల్ కలిసొస్తుందేమో చూడాలి.