కృతి శెట్టి బర్త్ డే స్పెషల్ గా కొత్త పోస్టర్ల సందడి!

21-09-2021 Tue 11:06
  • వరుస అవకాశాలతో దూసుకుపోతున్న కృతి శెట్టి
  • రీలీజ్ కి రెడీ అయిన 'శ్యామ్ సింగ రాయ్'
  • షూటింగు దశలో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'
  • సెట్స్ పైనే ఉన్న రామ్ సినిమా
 New posters released from Krithi Shetty movies
ఇప్పుడు టాలీవుడ్లో కృతి శెట్టికి ఉన్న క్రేజ్ .. ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తొలి సినిమాతోనే అందంతోను .. అభినయంతోను ఆమె కట్టి పడేసింది. ఈ మధ్య కాలంలో యూత్ ను ఇంతగా ప్రభావితం చేసిన కథానాయిక రాలేదు. ఇప్పుడు ఆమె కుర్రాళ్ల కలల దేవతగా మారిపోయింది .. వరుస అవకాశాలతో దూసుకుపోతోంది.ఈ రోజున కృతి శెట్టి పుట్టిన రోజు .. ఈ సందర్భంగా నాని జోడీగా ఆమె చేసిన 'శ్యామ్ సింగ రాయ్' సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ ను వదిలారు. విభిన్నమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమాకి, రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించాడు. ఆ తరువాత ఆమె సుధీర్ బాబు సరసన నాయికగా, ఇంద్రగంటి దర్శకత్వంలో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' చేస్తోంది. ఈ సినిమా టీమ్ కూడా ఆమెకి బర్త్ డే విషెస్ తెలియజేసింది.ఇక రామ్ జోడీగా కృతి శెట్టి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. లవ్ అండ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకి లింగుసామి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నుంచి కూడా కృతి శెట్టి బర్త్ డే పోస్టర్ వదిలారు. మొత్తానికి ఈ రోజంతా కృతి శెట్టి పోస్టర్లతో సోషల్ మీడియా వేడెక్కిపోతోంది.