దూసుకుపోతున్న 'డేనియల్ శేఖర్' టీజర్!

21-09-2021 Tue 10:11
  • 'భీమ్లా నాయక్' పాత్రలో పవన్ 
  • డేనియల్ శేఖర్ పాత్రలో రానా 
  • టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ 
  • జనవరి 12వ తేదీన విడుదల     
Bheemla Nayak movie update

పవన్ కల్యాణ్ - రానా ప్రధాన పాత్రల్లో 'భీమ్లా నాయక్' సినిమా రూపొందుతోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి పవన్ కల్యాణ్ టీజర్ ను .. టైటిల్ సాంగ్ ను వదలగా, రికార్డు స్థాయిలో వ్యూస్ ను, లైక్స్ ను సొంతం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్న రానాకి సంబంధించిన టీజర్ ను వదిలారు.

'డేనియల్ శేఖర్' పాత్రలో రానా లుక్ .. ఆయన బాడీ లాంగ్వేజ్ బాగా ఆకట్టుకున్నాయి. పోలీస్ స్టేషన్లో భీమ్లా నాయక్' ముందు డేనియల్ శేఖర్ కేర్ లెస్ గా కూర్చుంటాడు. 'భీమ్లా నాయక్' భార్య పాత్రను పోషించిన నిత్యామీనన్ తో .. "నీ మొగుడు గబ్బర్ సింగ్ అంటా .. స్టేషన్లో టాక్ నడుస్తోంది. నేనెవరో తెలుసా? ధర్మేంద్ర .. హీరో .. "అంటూ రానా చెప్పిన డైలాగ్ కి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది.

చాలా వేగంగా ఈ టీజర్ 3 మిలియన్లకి పైగా వ్యూస్ ను రాబట్టడం విశేషంగా చెబుతున్నారు. సితార బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది. 'సంక్రాంతి' కానుకగా ఈ సినిమాను జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు.