ప్రపంచంలోనే అత్యంత వృద్ధ కవలలు.. ఎక్కడున్నారంటే..!

20-09-2021 Mon 22:05
  • జపాన్ అక్కాచెల్లెళ్లకు దక్కిన అరుదైన గౌరవం
  • వీరి వయసులు 107 సంవత్సరాల 330 రోజులు
  • గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు
oldest female twins of the world know where are they
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ కవలలుగా ఇద్దరు అక్కాచెల్లెళ్లకు అరుదైన గౌరవం దక్కింది. వీరి వయసు 107 సంవత్సరాల 330 రోజులు. ఇటీవలే ఈ అక్కాచెల్లెళ్లకు గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ నుంచి ధ్రువీకరణ పత్రాలు కూడా అందాయి. వీరిద్దరినీ అత్యంత వృద్ధ కవలలు (మహిళల) విభాగంలో ఈ అవార్డు వరించింది.

ఉమెనో సుమియామా, కోమే కొడామా అనే ఈ అక్కాచెల్లెళ్లిద్దరూ 1913 నవంబరులో జన్మించారు. ఈ కుటుంబంలో మొత్తం 11 మంది పిల్లలు జన్మించగా.. వీరిలో ఈ అక్కాచెల్లెళ్లు మూడో కాన్పులో పుట్టారు. ఇంతకు ముందు కూడా ఈ రికార్డు జపాన్ కవలల పేరిటే ఉంది. అయితే వారి వయసు 107 సంవత్సరాల 175 రోజులే కావడంతో ఇప్పుడు ఆ రికార్డు ఉమెనో సుమియామా, కోమే కొడామాలకు దక్కింది.