ఐపీఎల్ లో నేడు కోల్ కతా వర్సెస్ బెంగళూరు

20-09-2021 Mon 19:30
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు
  • ఆర్సీబీ కెప్టెన్ గా ఇదే తనకు చివరి టోర్నీ అన్న కోహ్లీ
  • మ్యాచ్ లో ప్రధాన ఆకర్షణగా కోహ్లీ
  • అబుదాబి వేదికగా మ్యాచ్
RCB has won the toss against KKR

ఐపీఎల్ 14వ సీజన్ మిగిలిన మ్యాచ్ లను యూఏఈలో నిర్వహిస్తున్న నేపథ్యంలో, నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ లో బెంగళూరు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

ఆర్సీబీ కెప్టెన్ గా ఇదే తన చివరి టోర్నీ అని విరాట్ కోహ్లీ ప్రకటించిన నేపథ్యంలో, ఈ మ్యాచ్ లో అందరి దృష్టి అతడిపైనే ఉండనుంది. గత సీజన్లకు భిన్నంగా ఐపీఎల్ 14వ సీజన్ లో బెంగళూరు జట్టు విశేషంగా రాణించింది. 7 మ్యాచ్ లు ఆడి ఐదింట గెలిచింది. భారత గడ్డపై జరిగిన ఈ సీజన్ తొలి భాగంలో కనబర్చిన ఊపునే బెంగళూరు యూఏఈలోనూ ప్రదర్శిస్తే టైటిల్ సాధ్యమేనని క్రికెట్ పండితులు భావిస్తున్నారు. అటు, నేటి మ్యాచ్ కోహ్లీకి ఐపీఎల్ లో 200వ మ్యాచ్. ఐపీఎల్ చరిత్రలో 200 మ్యాచ్ ల ఘనత అందుకున్న వారిలో కోహ్లీ ఐదోవాడు.