ప్రభాస్ చేతుల మీదుగా 'ఆకాశవాణి' ట్రైలర్ రిలీజ్!

20-09-2021 Mon 19:16
  • అడవి నేపథ్యంలో సాగే కథ 
  • నిర్మాతగా పద్మనాభరెడ్డి 
  • దర్శకుడిగా అశ్విన్ గంగరాజు 
  • ఈ నెల 24 నుంచి సోని లివ్ లో
Akashavani trailer released

అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో .. పద్మనాభరెడ్డి నిర్మాణంలో 'ఆకాశవాణి' రూపొందింది. చాలావరకూ కొత్త ఆర్టిస్టులతో రూపొందిన ఈ సినిమా నుంచి ప్రభాస్ చేతుల మీదుగా కొంతసేపటి క్రితం ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ను బట్టి ఇది అడవి ప్రాంతంలోని గిరిజన గూడెం చుట్టూ అల్లుకోబడిన కథ అనే విషయం అర్థమవుతోంది.

అడవిపైనే ఆధారపడి ఒక గూడెం వాసులు బ్రతుకుతూ ఉంటారు. అయితే ఒక దొర వాళ్ల అజ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని, వాళ్ల జీవితాలను శాసిస్తూ ఉంటాడు. ఎవరైనా తన మాటకి ఎదురు చెబితే వాళ్లని ఆ దొర చిత్రహింసలకు గురిచేస్తూ ఉంటాడు. దాంతో వాళ్లు ఆయన ఆధిపత్యాన్ని అంగీకరిస్తూ ఉంటారు.

అలాంటి పరిస్థితుల్లోనే ఆ గూడెం ప్రజలకు ఒక వ్యక్తి రేడియోను అందుబాటులోకి తీసుకొస్తాడు. ఆ రేడియో వాళ్ల జీవితాలను ఎలా ప్రభావితం చేసిందనేదే కథ. కీలకమైన పాత్రల్లో సముద్రఖని .. వినయ్ వర్మ కనిపిస్తున్నారు,. కాలభైరవ సంగీతాన్ని అందించిన ఈ సినిమా, సోని లివ్ లో ఈ నెల 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది.