కోర్టు సెక్షన్ ఆఫీస్ లోనే ఆగిన కేటీఆర్ పరువునష్టం దావా పిటిషన్

20-09-2021 Mon 18:52
  • రేవంత్ రెడ్డిపై పరువునష్టం దావా వేసిన కేటీఆర్
  • అవసరమైన పత్రాలు సమర్పించక పోవడంతో సెక్షన్ ఆఫీస్ లో ఆగిన పిటిషన్
  • రేపు వాటిని సమర్పిస్తానని కోర్టుకు తెలిపిన కేటీఆర్
KTRs defamation suit stopped at section office

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. అయితే దావాకు సంబంధించి కేటీఆర్ అవసరమైన మరికొన్ని పత్రాలు కోర్టుకు సమర్పించలేదు. దీంతో, ఆ పిటిషన్ కోర్టు సెక్షన్ ఆఫీసులోనే ఆగినట్టు, దీంతో, రేపు ఆ పత్రాలను సమర్పిస్తానని కోర్టుకు కేటీఆర్ తెలిపినట్టు తెలుస్తోంది.

డ్రగ్స్ వాడేవారికి కేటీఆర్ బ్రాండ్ అంబాసడర్ అని రేవంత్ రెడ్డి విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపడ్డారు. పరువునష్టం దావా వేశారు. తనకు సంబంధం లేని విషయాల్లో తన పేరును దురుద్దేశపూర్వకంగా వాడుతున్నారంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు హాజరవుతున్న వ్యక్తులతో కానీ, వారి కేసులతో కానీ తనకు సంబంధం లేదని తెలిపారు. తన పరువుకు భంగం కలిగించిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. తగిన పరిహారం చెల్లించేలా ఆదేశించాలని కోర్టును కోరారు.