Corona Virus: గాలి ద్వారా వేగంగా వ్యాపిస్తున్న కరోనా కొత్త వేరియంట్లు!

  • అమెరికాలో చేసిన అధ్యయనంలో వెల్లడైన విషయం
  • కరోనా పేషెంట్లు వదిలే ఊపిరిలో కూడా వైరస్ కణాలు
  • ఆల్ఫా వేరియంట్ సోకిన వారి ఊపిరిలో 43 నుంచి 100 శాతం అధికం
  • టైట్‌గా ఉండే మాస్కులు ధరించాలని పేషెంట్లకు సూచన
covid variants getting better at travelling through air

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని మరోసారి వణికిస్తోంది.  కొత్త వేరియంట్లు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికాలో చేసిన ఒక అధ్యయనంలో కొన్ని వాస్తవాలు బయటపడ్డాయి. తొలిగా ప్రపంచంలో విజృంభించిన కరోనా వైరస్‌తో పోలిస్తే కొత్తగా వస్తున్న వేరియంట్లు గాలి ద్వారా వేగంగా వ్యాపిస్తున్నాయని ఈ పరిశోధనలో తేలింది.

అంతేకాదు ఒరిజినల్ కరోనా సోకిన వారితో పోలిస్తే ఆల్ఫా వేరియంట్ సోకిన వారి ఊపిరి ద్వారా 43 నుంచి 100 రెట్లు అధికంగా వైరస్ క్రిములు గాల్లో ప్రవేశిస్తున్నాయని సైంటిస్టులు తెలిపారు. డెల్టా వేరియంట్ మరింత వేగంగా వ్యాపిస్తోందంటే ఇది సోకిన వారి నుంచి గాల్లోకి మరింత ఎక్కువ వైరస్ చేరుతున్నట్లేనని అంటున్నారు.

కరోనా పేషెంట్లు వదులుగా ఉండే మాస్కులు, సర్జికల్ మాస్కులు ధరించడం వల్ల వారి నిశ్వాసలో ఉండే కరోనా క్రిముల్లో 50 శాతం మాత్రాన్ని అవి నిరోధిస్తున్నాయని పరిశోధకులు చెప్పారు.

కరోనా సోకిన వారు టైట్‌గా ఉండే మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తిని మరింత ఎక్కువగా నియంత్రించవచ్చని వారు అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్ తీసుకోవడంతోపాటు ఇలా మాస్కులు ధరించడం, ఇళ్లలో వెంటిలేషన్ సదుపాయం సక్రమంగా ఉండేలా చూసుకోవడం వల్ల కరోనాను నియంత్రించవచ్చని పేర్కొన్నారు. ఆ అధ్యయనాన్ని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్‌కు చెందిన పరిశోధకులు చేశారు.

More Telugu News