వైసీపీ ఘన విజయాన్ని ఎల్లో మీడియా వక్రీకరిస్తోంది: గుడివాడ అమర్ నాథ్

20-09-2021 Mon 18:35
  • ఎన్నికల్లో టీడీపీ బీఫామ్ ఇచ్చింది చంద్రబాబే
  • కరోనా పేరుతో ఎన్నికలను వాయిదా వేయించారు
  • అధికారంలోకి రాగానే 90 శాతం హామీలను జగన్ నెరవేర్చారు
Yellow media is sidelining YSRCP victory says Gudivada Amarnath

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిందని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. అయితే ఈ విజయాన్ని ఎల్లో మీడియా వక్రీకరిస్తోందని మండిపడ్డారు. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు బీఫామ్ ఇచ్చింది చంద్రబాబేనని అన్నారు. కరోనా పేరుతో ఎన్నికలను చంద్రబాబు వాయిదా వేయించారని చెప్పారు. ఎన్నికల నిర్వహణ, ఫలితాలపై కూడా అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారని అన్నారు. ప్రతి ఎన్నికల్లో వైసీపీనే గెలుస్తోందని చెప్పారు.

అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి జగన్ 90 శాతం హామీలను నెరవేర్చారని అమర్ నాథ్ తెలిపారు. టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఒక గంజాయి డాన్ అని దుయ్యబట్టారు. ఎన్నికల ఫలితాలను తప్పుదోవ పట్టించేందుకే అయ్యన్నపాత్రుడితో చంద్రబాబు మాట్లాడించారని మండిపడ్డారు. పరిషత్ ఎన్నికలపై అయ్యన్నపాత్రుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.