డేనియల్ శేఖర్ వచ్చేశాడు.... 'భీమ్లానాయక్' నుంచి తాజా టీజర్ విడుదల

20-09-2021 Mon 18:29
  • మలయాళంలో హిట్టయిన అయ్యప్పనుమ్ కోషియుమ్
  • తెలుగులో భీమ్లా నాయక్ గా రీమేక్
  • భీమ్లా నాయక్ గా పవన్ కల్యాణ్
  • డేనియల్ శేఖర్ గా రానా
  • సాగర్ కె చంద్ర డైరెక్షన్
Daniel Shekhar teaser from Bheemla Naik movie out now
పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న 'భీమ్లా నాయక్' చిత్రంలో ప్రతినాయకుడిగా రానా నటిస్తుండడం తెలిసిందే. ఇందులో రానాది హీరోతో సమానంగా సాగే పవర్ ఫుల్ పాత్ర. డేనియల్ శేఖర్ అనే రౌడీగా రానా నటిస్తున్నాడు. తాజాగా 'భీమ్లా నాయక్' చిత్రబృందం డేనియల్ శేఖర్ ను పరిచయం చేస్తూ టీజర్ రిలీజ్ చేసింది. రానా తనదైన శైలిలో చెప్పిన డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి.

మలయాళంలో హిట్టయిన 'అయ్యప్పనుమ్ కోషియుమ్' చిత్రాన్ని తెలుగులో సాగర్ కె చంద్ర డైరెక్షన్ లో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు మాటలు, స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ శ్రీనివాస్ సమకూర్చుతుండడం విశేషం. పవన్ కల్యాణ్ ఇందులో భీమ్లా నాయక్ అనే పోలీసాఫీసర్ గా నటిస్తుండగా, డేనియల్ శేఖర్ అనే రౌడీగా రానా మరో ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. సితార ఎంటర్టయిన్ మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.