స్కూల్‌ బ్యాగు, బూట్ల నాణ్యతను పరిశీలించిన జగన్

20-09-2021 Mon 17:49
  • జగనన్న విద్యా కానుక కిట్లో ఇచ్చే బ్యాగులు, బూట్ల పరిశీలన
  • సీఎంకు చూపించిన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి
  • వచ్చే ఏడాది వీటిని విద్యార్థులకు ఇవ్వనున్న ప్రభుత్వం
Jagan examines the quality of Jagananna kit bag and boots

జగనన్న విద్యా కానుక కిట్ లో భాగంగా అందించనున్న స్కూల్ బ్యాగులు, బూట్ల నాణ్యతను ముఖ్యమంత్రి జగన్ ఈరోజు పరిశీలించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో వీటిని జగన్ కు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, సీఎంవో అధికారులు చూపించారు. వచ్చే ఏడాది వీటిని విద్యార్థులకు అందజేయనున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు వీటిని ఇస్తున్నారు. ఈ కిట్ లో 3 జతల యూనిఫాం, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, స్కూలు బ్యాగు, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, బెల్టు, డిక్షనరీ ఉంటాయి. 6 నుంచి 7వ తరగతి వారికి 8 నోటు పుస్తకాలు, ఎనిమిదో తరగతికి 10, తొమ్మిదో తరగతికి 12, పదో తరగతికి 14 నోటు పుస్తకాలను ఇస్తున్నారు.