23న 'మహాసముద్రం' ట్రైలర్ రిలీజ్

20-09-2021 Mon 17:13
  • మల్టీ స్టారర్ గా 'మహాసముద్రం'
  • మాస్ యాక్షన్ నేపథ్యంలో సాగే కథ
  •  అక్టోబర్ 14వ తేదీన సినిమా విడుదల  
Maha Samidram movie update
శర్వానంద్ - సిద్ధార్థ్ కథానాయకులుగా 'మహా సముద్రం' చిత్రం రూపొందింది. అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాకి, అజయ్ భూపతి దర్శకత్వం వహించాడు. యాక్షన్ .. ఎమోషన్స్ సమపాళ్లుగా కలిపి, ఆయన ఈ కథను రెడీ చేశాడు. చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను అక్టోబర్ 14వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన పోస్టర్లకు .. స్పెషల్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 23వ తేదీన ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు.

మాస్ అంశాలు పుష్కలంగా ఉన్న ఈ సినిమాలో, అదితీ రావు .. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటించారు. ముఖ్యమైన పాత్రల్లో జగపతిబాబు .. రావు రమేశ్ కనిపించనున్నారు. కొంత కాలంగా వరుస పరాజయాలతో ఉన్న శర్వానంద్ కీ, తమిళ సినిమాలకే పరిమితమైన సిద్ధార్థ్ కి ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.